 
                                    - ఆర్థికసాయం కోసం కూలీ కుటుంబం ఎదురుచూపు
మక్తల్, వెలుగు: డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి చదివింది. ఎంబీబీఎస్ సీటు కొట్టింది. కాగా.. ఆమె కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. కాలేజీ ఫీజు కట్టే ఆర్థిక స్థోమత కూడా లేదు. దాతలు స్పందించి ఆర్థికసాయం అందిస్తే ఆమె డాక్టర్అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన రాధిక, చెన్నప్ప దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.
భార్యాభర్తలు కూలీ పనులు చేస్తుంటారు. ముగ్గురు కూతుళ్లను గురుకుల పాఠశాలల్లో చదివిస్తున్నారు. వీరి పెద్ద కూతురు ఇందు ఇంటర్ బైపీసీలో 950 మార్కులు సాధించింది. నీట్ ఎగ్జామ్ రాయగా.. కౌన్సెలింగ్ లో వరంగల్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. తొలి ఏడాది ఫీజు రూ 1.20 లక్షలు కట్టాలి. తమకు అంత ఫీజు చెల్లించే స్థోమత లేదని, ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికసాయం అందించాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
ఇందు ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులకు వెళ్తోంది. ఆర్థికసాయం చేయాలనే దాతలు SBI a/c : 62187954860, IFSC కోడ్ : sbin 0020197, లేదంటే.. 6305646827, 9553628001, 9059999510 నంబర్లకు ఫోన్‌పే, గోగూల్పే ద్వారా పంపించాలని విద్యార్థిని వేడుకుంటోంది.

 
         
                     
                     
                    