గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఆకతాయిలు : ప్రాణం పోతున్నా మనుషులపై దయ చూపింది

గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఆకతాయిలు : ప్రాణం పోతున్నా మనుషులపై దయ చూపింది

కేరళలో దారుణం జరిగింది. గర్భంతో ఉన్న ఏనుగును ఆకతాయిలు ప్రాణం తీశారు. మనుషుల్లో మానవత్వం లేదని ఆకతాయిలు నిరూపిస్తే ..మూగ జీవుల్లో దయాగుణం ఉందని నిరూపించింది గర్భంతో ఉన్న ఏనుగు

కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఓ గ్రామంలో గర్భంతో ఉన్న టస్కర్ అనే ఏనుగు ఆహారం కోసం వెతికింది. ఆహారం దొరకలేదు. అయితే అదే గ్రామానికి చెందిన కొందరు ఆకతాయిలు  ఏనుగు నోట్లో క్రాకర్స్ అమర్చిన పైనాపిల్ ను పెట్టారు. అనంతరం క్రాకర్స్ కు నిప్పంటించారు. దీంతో క్రాకర్స్ ఒక్కసారిగా పేలడం గర్భంతో ఉన్న ఏనుగు నోట్లో, తొండంలో నుంచి రక్తం వరదలా పారింది. అయినా స్థానికులకు ఎలాంటి హాని తలపెట్టకుండా నొప్పితోనే స్థానికంగా ఉన్న వెల్లియార్ నదిలోకి వెళ్లి నీళ్లు తాగింది. కొద్ది సేపటికి రక్తం కక్కుతూ మరణించింది.

టస్కర్ ఎవర్ని ఏం చేయలేదు

ఏనుగు మరణంపై అటవీ అధికారి మోహన్ కృష్ణన్ స్పందించారు. టస్కర్ అందర్ని నమ్మింది. కానీ ఇలా ప్రాణాలు తీస్తారని అనుకోలేదు. క్రాకర్ పేలినప్పుడు నోటి వెంట రక్తం కారుతున్నా తన గురించి ఆలోచించలేదు. తన కడుపులో ఉన్న తన పిల్లల గురించి ఆలోచించి షాక్ అయ్యింది. కడుపులో 18 నుంచి 20 నెలల గున్న ఏనుగు ఉంది. నోటిలో క్రాకర్లు పేలడంతో  నాలుక, నోటిపై తీవ్ర గాయాలయ్యాయని ఎన్డీటీవీకి తెలిపారు. అంత బాధలో ఉన్నా ఎవర్ని ఏమీ అనలేదని, అక్కడి నుంచి వెళ్లిందని అటవీ శాఖ అధికారి మోహన్ కృష్ణ వెల్లడించారు.