నిర్మల్‌లో ప్రైవేట్ బస్సు బోల్తా..15 మందికి తీవ్ర గాయాలు

 నిర్మల్‌లో ప్రైవేట్ బస్సు బోల్తా..15 మందికి తీవ్ర గాయాలు

నిర్మల్ జిల్లా కొండాపూర్ బైపాస్ రోడ్డు దగ్గర ఓ ప్రైవేటు ట్రావెల్స్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి యూపీ వెళ్తున్న ఏసియన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి నిర్మల్ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోనే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు ప్రయాణికులు.