
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇవాళ( మే17) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయలయ్యాయి.
తెలంగాణలోని దామరచర్ల మండలం నరసాపురం గ్రామం నుండి గురజాల మండలం పులిపాడుకు కూలీలతో వెళ్తున్న ఆటోను పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఐదుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రి తరలిస్తుండగా చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారంతా దామరచర్ల మండలం నరసాపురం గ్రామ వాసులు ఇస్లావత్ ముజుల (25), భూక్య పద్మ (27), పానియా సక్ర (35), భూక్య నాని (55), మాలావత్ కలిత (30), ఇస్లవత్ పార్వతిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.