
డ్రమ్లో మహిళల మృతదేహలు వరుసగా కనిపించడం ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలలో సమయంలో ముగ్గురు మహిళలు డ్రమ్ముల్లో చనిపోయి కనిపించారు. తాజాగా బెంగళూరులోని బైయప్పనహళ్లి రైల్వే స్టేషన్‌లో పరిధిలో ఉన్న డ్రమ్ములో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దీనిపై స్పందించిన పోలీసులు గతంలో డ్రమ్ లో దొరికిన మహిళల మృతదేహలకు దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మృతురాలిని 27 ఏళ్ల తమన్నాగా పోలీసులు గుర్తించారు.
ఆమెను ఆమె బావ చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. బిహార్ అరేరియాలోనే తన భర్త అఫ్రోజ్ ను వదిలి బంధువైన ఇంతెకాబ్‌తో తమన్నా పారిపోయి బెంగళూరుకు వచ్చి నివసించిందని వివరించారు. అఫ్రోజ్ సోదరుడు కమల్ ఆయన మిత్రుల సహకారంతో ఫిబ్రవరి 12వ తేదీన తమన్నాను చంపేశాడని తెలిపారు. మరుసటి రోజు రైల్వే స్టేషన్ సమీపంలో డ్రమ్‌లో తమన్నా డెడ్ బాడీని వదిలిపెట్టి వెళ్లారని, వారు వెళ్లిన ఆటోరిక్షాను సెక్యూరిటీ ఫుటేజీ సహాయంతో ట్రాక్ చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరో ఐదుగురు మిస్ అయ్యారని పేర్కొన్నారు.
బెంగళూరులో ఇలాంటి తరహా తొలి ఘటన డిసెంబర్ 6వ తేదీన చోటుచేసుకుంది. ట్రైన్‌లో ఓ డ్రమ్‌లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. ఆ తరువాతజనవరి 4న పలు గాయాలతో ఓ మహిళ డెడ్ బాడీ కనిపించింది. అయితే ఈ ఇద్దరి మృతదేహాలు ఎవరివో పోలీసులు ఇంకా గుర్తించలేదు. అయితే ఈ ఘటనలపై బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని స్పందించిన కాంగ్రెస్ ఇవి సీరియల్ కిల్లింగ్ అంటూ ఆరోపించింది. .