కర్ణాటక బీదర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 05) బీదర్ దగ్గర కారు, వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
చనిపోయిన వారిని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన వారిగా గుర్తించారు. గానుగాపుర్ దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిని (నవీన్ 40), రచప్ప (45), కాశీనాథ్ (60)గా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
