గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష

గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష

సూడాన్: ఎక్కడైన నేరం చేస్తే మనుషులకు శిక్షలు వేస్తారు. నేర తీవ్రతను బట్టి రకరకాల శిక్షలు వేస్తుంటాయి కోర్టులు. కానీ హత్యా నేరారోపణ కింద ఓ గొర్రెకు మూడేళ్ల కఠిన శిక్ష పడటం మీరెప్పుడైనా విన్నారా. అయితే చదవండి మరి. 

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన సూడాన్ దేశంలోని రుంబెక్ ఈస్ట్ లోని అకుల్ యోల్ ప్రాంతంలో జరిగింది. ఆదియు చాపింగ్ (45) అనే మహిళపై ఓ గొర్రె దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో ఆ మహిళ పక్కటెముకలు విరిగాయి. తీవ్ర రక్త స్రావం కావడంతో... చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో గొర్రె, అలాగే గొర్రె యజమానిపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు యజమానితో పాటు గొర్రెను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణకు చేపట్టిన జడ్జి  గొర్రెకు మూడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మూడేళ్ల పాటు ఆ గొర్రెను మిలటరీ క్యాంపులో బంధించాలని ఆదేశించారు. ఇక గొర్రె యజమానికి ఫైన్ వేశారు. బాధిత కుటుంబానికి 5 ఆవులు ఇవ్వడంతో పాటు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం ఆ గొర్రెను కూడా మృతురాలి కుటుంబానికి అప్పజెప్పాలని ఆదేశించారు. కాగా కోర్టు ఉత్తర్వులపై ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు సంతకాలు చేశారు.

మరిన్ని వార్తల కోసం...

పాతిక వేలకు ప్లాస్టిక్ బకెట్

పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో?