కూసుమంచి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు బాంబే ఐఐటీలో సీటు

కూసుమంచి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు బాంబే ఐఐటీలో సీటు

కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గంగాబండతండాకు చెందిన ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ బాంబే ఐఐటీలో సీటు సాధించింది. తండాకు చెందిన మోతీలాల్‌‌‌‌‌‌‌‌, సరోజ దంపతులకు కూతురు బానోతు నవ్య ఇటీవల జేఈఈ ఎంట్రెన్స్‌‌‌‌‌‌‌‌ రాసి గిరిజన విభాగంలో 1,251 ర్యాంకు సాధించడంతో ఐఐటీ బాంబేలో సీటు పొందింది. కూసుమంచిలోని ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌లో టెన్త్‌‌‌‌‌‌‌‌ వరకు చదివి

9.5 జీపీఏ సాధించిన నవ్య ఇంటర్‌‌‌‌‌‌‌‌ కోసం వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా పరిగి గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీలో చేరి 964 మార్కులు సాధించింది. తమ తండాకు చెందిన నవ్య ఐఐటీ బాంబేలో సీటు సాధించడం పట్ల తండావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ కావాలన్నదే తన లక్ష్యమని నవ్య చెప్పింది.