నిజామాబాద్, వెలుగు: ట్యూటర్వేధింపుల కారణంగా నర్సింగ్విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి(18) నిజామాబాద్ ప్రభుత్వ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్సెకండియర్చదువుతూ నగరంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. సదరు విద్యార్థిని ఫోన్నంబర్తీసుకున్న ట్యూటర్డాక్టర్గౌతమ్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడు.
వేధింపులు మరింత పెరగడంతో శుక్రవారం హాస్టల్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. రూమ్మేట్స్ హాస్టల్ నిర్వాహకులకు తెలిపి జీజీహెచ్‌కు షిఫ్ట్చేశారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. స్టూడెంట్ సూసైడ్యత్నానికి కారకుడైన ట్యూటర్‌ను ఉద్యోగంనుంచి టర్మినేట్చేసినట్లు కాలేజీ ప్రిన్సిపాల్డాక్టర్ కృష్ణమోహన్తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు.
