పోయిన సూట్ కేస్ నాలుగేండ్లకు దొరికింది

పోయిన సూట్ కేస్ నాలుగేండ్లకు దొరికింది

ఓరెగాన్: ఎయిర్ పోర్టుల్లో ప్యాసింజర్ల లగేజీ బ్యాగ్ లు, సూట్ కేసులు అప్పుడప్పుడు మిస్ అవుతుంటయ్. కొన్నిసార్లు పోయిన కొన్ని రోజులకే దొర్కుతయ్. మరికొన్ని సార్లు అసలే దొరక్కపోవచ్చు. అయితే ఒకామెకు పోయిన తన సూట్ కేస్ నాలుగేండ్లకు దొరికింది. అమెరికాలోని ఓరెగాన్ కు చెందిన ఏప్రిల్ గావిన్ నాలుగేండ్ల కింద బిజినెస్ ట్రిప్ కోసం చికాగో వెళ్లింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఆ టైమ్ లో ఆమె సూట్ కేస్ పోయింది. ఎయిర్ పోర్టులో వెతికినా దొరకలేదు. ఎయిర్ లైన్స్ వాళ్లను అడిగితే ‘అదెక్కడ మిస్ అయిందో మాకు తెలియదు” అని జవాబిచ్చారు. తన లగేజీ పోయిందంటూ గావిన్ సోషల్ మీడియాలోనూ వీడియో షేర్ చేశారు. అప్పటి నుంచి ఎయిర్ లైన్స్ వాళ్లకు ఫోన్ చేస్తూ తన సూట్ కేస్ గురించి అడుగుతూనే ఉన్నారు. చివరికి ఈ నెలలో ఆమె సూట్ కేస్ దొరికింది.