
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం రేపింది. బుధవారం (అక్టోబర్ 08) ఆవు దూడపై పంజా విసరడంతో దూడ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అటవీ పరిసర ప్రంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కాగజ్‌నగర్ మండలం అనుకోడ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లుగా ఫారెస్టు అధికారులు గుర్తించారు. పులి దాడిలో దూడ ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మహరాష్ట్ర తడోబా అభయారణ్యం నుండి వచ్చిన మగపులిగా భావిస్తున్నారు. ఈ పులికి మూడేళ్ల వయస్సు ఉంటుందని అధికారులు తెలిపారు.
ALSO READ : మంజీరా నదిలో బయటపడిన నాగిని, మహిషాసుర మర్ధిని విగ్రహాలు
దూడపై దాడి చేసిన పులి.. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కింది. ట్రాకర్ల ద్వారా పులిని ట్రాకింగ్ చేస్తున్నారు. పులి సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. పశువుల కాపర్లు, రైతులు ఒంటరిగా అటవీ సమీపంలోకి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.