నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం...

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం...

నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలలో మళ్ళీ మరోసారి పెద్దపులి కలకలం రేగింది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు సమీపంలో పెద్దపులి హల్చల్ చేసింది. గ్రామ సమీపంలో వరదరాజ స్వామి ప్రాజెక్టుకు వెళ్లే రహదారిలో రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించడంతో గ్రామస్తులు పెద్దపులిని సెల్‌ ఫోన్ల్‌ చిత్రీకరించారు. 

 నెల రోజుల నుంచి పెద్దపులి గ్రామ పరిసరాల్లో సంచరిస్తుందని, పంట పొలాల్లో గ్రామానికి సమీపంగా వచ్చి వెళుతుందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ గ్రామానికి చెందిన పశువులను మేకలను చాలా వాటిని చంపి తినిందని గ్రామస్తులు అంటున్నారు. కానీ ఈ విషయాలను బయటకి రాకుండా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. 

 ఏలూరు జిల్లాలో పులుల సంచారం ప్రజ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశాయి. ఇటీవ‌ల కాలంలో అక్కడ పలు చోట్ల పులులు సంచరిస్తున్నట్లు తెలియడంతో జనాలు క‌ల‌వ‌ర పడుతున్నారు. ఇప్పుడు  సత్తెన్నగూడెం గ్రామ శివారులోని ఒక తోటలో పెద్ద పులి జాడలు కనిపించాయి. దీంతో ఆ ప్రాంత వాసులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.  బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోనూ పులులు సంచరిస్తున్నాయంటూ స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.