ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ టెండర్లు ఓపెన్

ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ టెండర్లు ఓపెన్

ఎవాల్యుయేషన్ తర్వాత టెండరు ఫైనల్ చేయనున్న రైల్వే

హైదరాబాద్, వెలుగు : ఖాజీపేట రైల్వే వాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్​కు మొత్తం 7 కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. బుధవారం రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) అధికారులు టెండర్లు ఓపెన్ చేశారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తున్నామని, ఆర్వీఎన్ఎల్ గైడ్ లైన్స్ ప్రకారం టెక్నికల్​గా క్వాలిఫై అయిన కంపెనీల ఫైనాన్సి యల్ బిడ్​ను త్వరలో ఓపెన్ చేయను న్నట్లు అధికారులు తెలిపారు. తర్వాత టెండర్​ ఫైనల్ చేయనున్నారు. ఫైనాన్సి యల్ బిడ్ లో ఎల్ 1 గా నిలిచిన కంపెనీ టెండర్ దక్కించుకోనుంది.

ఏయే కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయో చెప్పేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరాకరించారు. ఈ వారం లోనే టెండర్ ఫైనల్ చేస్తామని చెప్తు న్నారు. రూ.383 కోట్లతో ఈ యూనిట్ ను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. 2016లో రూ.269 కోట్లతో ఈ యూనిట్ ను కేంద్రం సాంక్షన్ చేయగా, దీనికి కావాల్సిన భూమిని రాష్ట్ర సర్కారు సకాలంలో అప్పగించకపోవడంతో జాప్యం అయ్యింది. రెవెన్యూ శాఖ క్లియరెన్స్​తో ఆర్వీఎన్ఎల్ అధికారులు టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టారు.