యాత్ర2 వీడియో వైరల్..రీల్ జగన్..రియల్ జగన్లా

యాత్ర2 వీడియో వైరల్..రీల్ జగన్..రియల్ జగన్లా

డైరెక్టర్ మహి.వి రాఘవ్(Mahi v Raghav) తెరకెక్కించిన యాత్ర(Yatra) మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar reddy) చేపట్టిన పాదయాత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా కనిపించి మెప్పించారు. 

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా యాత్ర2(Yatra2) తెరకెక్కుతుంది. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి జగన్ పాత్రలో నటిస్తున్న రంగం ఫేమ్ హీరో జీవా(Jiiva) లుక్ టెస్ట్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. హీరో జీవా విజువల్స్ చూస్తుంటే.. పాదయాత్ర టైంలో జగన్ ఎలా ఉండేవాడో అచ్చం అలాంటి పర్సనాలిటీతో..సేమ్ టు సేమ్ కనిపిస్తుండటంతో అందరిని ఆకట్టుకుంటోంది. 
ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఒరిజినల్ జగన్..జీవా..ఒకేలా ఉన్నారేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ కానుందని ఇదివరకే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి..నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అనే డైలాగ్ ని పోస్టర్ లో యాడ్ చేశారు మేకర్స్. ఈ డైలాగ్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్(YS Jagan) చేపట్టిన ఓదార్పు యాత్ర నుండి ఆయన సీఎం అయ్యేవరకు జరిగిన విషయాలను యాత్ర2 సినిమాలో చూపించనున్నారు డైరెక్టర్ మహి వీ రాఘవ్. ఈ మూవీని యువీ సెల్ల్యులాయిడ్స్, త్రీ ఆటుమైన లీఫ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ..సంతోష్ నారాయణ్(Santhosh narayan) సంగీతం అందిస్తున్నారు.