ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామికి ఘనస్వాగతం

 ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామికి ఘనస్వాగతం

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: విదేశీ పర్యటన అనంతరం చెన్నూరు నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జైపూర్ మండలం ఇందారం వద్ద ఎమ్మెల్యేకు శాలువా కప్పి బొకే అందజేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ అంశాలపై ఆయన లీడర్లు, కార్యకర్తలను ఆడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల ప్రెసిడెంట్​ఫయాజ్, ముక్తి శ్రీనివాస్, బండి సదానందం యాదవ్, మల్లేశ్, అరికె సంతోష్​, శ్రీనివాస్ ​తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో నష్టపోయిన చెన్నూరు మండలం సుందరశాల గ్రామ రైతులు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో వివేక్​ను​ కలిశారు. బ్యాక్ వాటర్​తో తమ పంటలు, భూములకు నష్టం జరుగుతోందని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతుల మనవరాలు నైనా బర్త్​డే వేడుకలు బుధవారం రాత్రి నిర్వహించగా ఎమ్మెల్యే వివేక్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, సీనియర్​జర్నలిస్ట్​ ఎండీ మునీర్, దుర్గం నరేశ్ తదితరులు హాజరై ​చిన్నారిని అశీర్వదించారు.

మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్ ​పాత్రికేయుడు హెచ్.రవీందర్ తల్లి ఈశ్వరమ్మ, బీజేపీ లీడర్ ​అందుగుల శ్రీనివాస్ మామ కోలా ఎల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆ కుటుంబాలను వివేక్ ​వెంకటస్వామి పరామర్శించారు.