అమెరికా టు పంచాయతీ.. లట్టుపల్లి సర్పంచ్ గా నామినేషన్ వేసిన మహిళ

అమెరికా టు పంచాయతీ.. లట్టుపల్లి సర్పంచ్ గా నామినేషన్ వేసిన మహిళ

కందనూలు, వెలుగు :  ఓ మహిళ అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ ఆసక్తిగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో పోటీకి ఆసక్తి చూపుతూ గ్రామానికి చెందిన కమతం నందిని అమెరికా నుంచి వచ్చి మంగళవారం నామినేషన్ వేశారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతోనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. గ్రామస్తులు సహకరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధి కృషి చేస్తానని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లల నిబంధన సడలింపుతో పాటు జనరల్ మహిళ సీటు రిజర్వ్ కావడంతో కుటుంబ సభ్యులు, కొందరు గ్రామస్తుల ప్రోత్సహించడంతో ఇక్కడికి వచ్చి ఆసక్తి చూపి నామినేషన్ వేసినట్టు ఆమె చెప్పారు. గ్రామానికి చెందిన నందిని కొన్నాళ్లుగా అమెరికాలో స్థిరపడిన కొడుకు, కూతురు వద్ద ఉంటుంది.