ఇది పంజాబ్.. ఇండియా కాదు .. ఆలయంలోకి అమ్మాయిని అనుమతించలేదు

ఇది పంజాబ్.. ఇండియా కాదు .. ఆలయంలోకి అమ్మాయిని అనుమతించలేదు

పంజాబ్లోని అమృత్ సర్లో  స్వర్ణ దేవాలయం భారత దేశంలో ప్రసిద్ధ టెంపుల్స్లో ఒకటి.  అమృత్ సర్ దేవాలయం ప్రధానంగా సిక్కుల యాత్రా స్థలం. గురుద్వారాగా పిలువబడే ఈ సిక్కుల పుణ్య క్షేత్రాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ఆలయంలోకి ప్రవేశించకుండా ఓ అమ్మాయిని అడ్డుకున్న సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. 
 
అమృత్‌సర్ లోని  గోల్డెన్ టెంపుల్ కు ఓ అమ్మాయి తన చెంపలపై మూడు రంగుల జెండా పేయింటింగ్‌ను వేసుకొని వచ్చింది. అయితే  ఆ ఆలయ  ప్రవేశ ద్వారా వద్ద ఉన్న సేవాదర్ ఆమెను లోపలికి అనుమతించలేదు. తన చెంపకు ఉన్న రంగులేంటని అడగగా.. అది జాతీయ జెండా రంగులని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి ఇది పంజాబ్ అని....ఇండియా కాదని ఆమెతో చెప్పాడు. గోల్డెన్ టెంపుల్ లోకి వెళ్తానని చెప్పినా వినిపించుకోక ఆమెతో వాదించాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ ఘటనపై జనరల్ సెక్రటరీ ఆఫ్ షిరోమణి గురుద్వార పర్బందక్ కమిటీ స్పందించింది. గోల్డెన్ టెంపుల్ సిక్కుల పవిత్ర స్థలమని తెలిపింది.  ప్రతి మతపరమైన స్థలానికి దాని సొంత విధానాన్ని కలిగి ఉంటుందని SGCP జనరల్ సెక్రటరీ గురుచరణ్ సింగ్ గరేవాల్ అన్నారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరిని మేము స్వాగతిస్తామన్నారు. ఈ క్రమంలో ఎవరి పట్ల అయినా  అసభ్యంగా ప్రవర్తించినట్లైతే క్షమాపణలు కోరుతున్నామని పేర్కొన్నారు. ఆ అమ్మాయిపై ఉన్న రంగులపై అశోక చక్రం లేదని....అది భారత జాతీయ జెండా కాదని ఆయన స్పష్టం చేశారు. అది రాజకీయ జెండా కావచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశారు.