
తమిళనాడులోని నీలగిరి కొండల గురించి అందరికీ తెలిసిందే. మంచి టూరిస్ట్ ప్లేస్. కానీ, అక్కడ ఉండేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వాళ్లకి హెల్త్ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువయ్యాయి. సరైన ట్రీట్మెంట్ అందక, హాస్పిటల్స్ అందుబాటులో లేకపోవడం చూసి చలించిపోయింది అక్కడ కేఫ్ నడుపుతున్న రాధికా. కొవిడ్ సెకండ్ వేవ్ అక్కడ తీవ్రంగా ఉన్న రోజులవి. ఒకామె ఉన్నట్టుండి నేల మీద పడిపోయింది. దగ్గర్లో హస్పిటల్ లేదు. అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే గంట తర్వాత వచ్చింది. సరిగ్గా అప్పుడే రాధికకు ఓ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే నీలగిరి ఏరియాలో తానే సొంతంగా ఆటో అంబులెన్స్‌లను డిజైన్ చేసింది. వాటిని డిజైన్ చేయడానికి ముందు చాలా స్టడీ చేసింది. మొదట్లో ఎంతోమంది ఆటో డ్రైవర్లతో మాట్లాడింది. వాళ్లతో కలిసి ప్రయాణం చేసింది. ఇలా చివరికి ఆటోను అంబులెన్స్‌గా మార్చే ప్రాజెక్ట్ చేపట్టింది. ఆక్సిజన్ సిలిండర్, పేషెంట్‌తో పాటు ఇద్దరు కూర్చోవడానికి రెండు సీట్లు, స్ర్టెచర్, మెడికల్ ఎక్విప్మెంట్తో ఆటో అంబులెన్స్ తయారుచేసింది. ఇలా ఒక్కటి కాదు మొత్తం ఆరు ఆటో అంబులెన్స్‌లను తయారు చేసి స్థానిక అంబులెన్స్ సర్వీస్‌లకు, హాస్పిటల్‌కు ఇచ్చింది.ఇవి ప్రత్యేకంగా నీలగిరి ఏరియా ప్రజల కోసం అందుబాటులో ఉంటాయి. ఈ ఆరు అంబులెన్స్‌లను తయారు చేసేందుకు సుమారు 24లక్షలు ఖర్చయ్యింది ఆమెకు. ఈమె సేవల గురించి తెలుసుకున్న ప్రధాని కూడా ఇటీవల ఆమెను ప్రశంసించారు.