మంగపేట, వెలుగు: ములుగు జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ యువకుడు సూసైడ్చేసుకున్నాడు. మంగపేట ఎస్సై–2 సురేశ్తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండల కేంద్రానికి చెందిన చిలకల అజయ్కుమార్రెడ్డి స్థానికంగా హోటల్నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ కలహాలతోపాటు మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం కమలాపురం హైదర్ కుంట చెరువు సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
