ఏఎన్ఎంను చూసి చెట్టెక్కిన యువకుడు

ఏఎన్ఎంను చూసి చెట్టెక్కిన యువకుడు

గతంలో ప్రపంచ దేశాలను వణికించిన కరోనా.. ఈ సారి ఒమిక్రాన్ రూపంలో భయపెట్టిస్తోంది. దాంతో దేశాలన్నీ వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేశాయి. తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరికీ కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ అయినా వేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో వైద్యశాఖ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ స్పీడప్ చేసింది. అయితే ఇంకా చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామానికి చెందిన గౌసుద్దీన్ ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. దాంతో ఏఎన్ఎం టీకా వేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు. వైద్య సిబ్బంది రాకను గమనించిన గౌసుద్దీన్.. ఇంటి ముందున్న చెట్టెక్కి కూర్చున్నాడు. కుటుంబసభ్యులు, వైద్య సిబ్బంది గంటసేపు బతిమాలినా గౌసుద్దీన్ మాత్రం చెట్టు దిగలేదు. దాంతో చేసేదేమీ లేక వైద్యసిబ్బంది వెనుదిరిగారు.