యువకుడు దారుణ హత్య.. ఇంటి ముందే డెడ్‌‌బాడీని పడేసిన దుండగులు

యువకుడు దారుణ హత్య.. ఇంటి ముందే డెడ్‌‌బాడీని పడేసిన దుండగులు

జిన్నారం, వెలుగు: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన దుండగులు.. డెడ్‌‌బాడీని అతడి ఇంటి ముందే పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని కేబీఆర్‌‌ కాలనీలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం‌ జిల్లా ఒంగోలుకు చెందిన తన్నీరు జయప్రకాశ్‌‌ (22) తన తల్లి రాధతో కలిసి బొల్లారంలో ఉంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఫ్రెండ్స్‌‌తో కలిసి బైక్‌‌పై బయటకు వెళ్లాడు. 

సోమవారం ఉదయం అతడి ఇంటి ముందే డెడ్‌‌బాడీ కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రవీందర్‌‌రెడ్డి తన టీంతో ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. జయప్రకాశ్‌‌ కుడి కాలు మడమ ఫ్రాక్చర్‌‌ అయినట్లు ఉండడం, ముఖంపై ఘాట్లు, దెబ్బలు కనిపించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.