Adah Sharma: ఆదాశర్మని ఫ్రాడ్ అనేసిన నెటిజన్.. దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిందిగా!

Adah Sharma: ఆదాశర్మని ఫ్రాడ్ అనేసిన నెటిజన్.. దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిందిగా!

నోటికొచ్చినట్టు వాగిన ఓ నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నార్త్ బ్యూటీ ఆదాశర్మ(Adah Sharma). ఇటీవల ఆమె ఇఫ్తార్ విందులో కనిపించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఫ్రాడ్ అనేశాడు. దానికి ఆదా దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రంజాన్ మాసం సంద‌ర్భంగా ఆమె ఓ ఇఫ్తార్ విందుకి హాజరయ్యారు. దానికి సంబందించిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోను ఓ నెటిజ‌న్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఎంత మోసం.. నార్మ‌ల్ రోజుల‌లో ముస్లింలను విల‌న్లుగా చూపిస్తూ ద్వేషపూరిత సినిమాలు చేస్తారు. ఇప్పుడేమో ముస్లింలు గొప్పవారు. ఎందుకంటే బిర్యానీ కోసం ఆహ్వానించారు కదా.. అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. దానికి కౌంటర్ గా ఆదా స్పందిస్తూ.. డియ‌ర్ స‌ర్.. ఏ రోజు అయినా ఉగ్రవాదులు మాత్రమే విలన్లు. ముస్లింలు కాదు..  అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆమె ఇచ్చిన రిప్లై కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ | Mythri Movie Makers: భారీ సినిమాలకు కేరాఫ్ మైత్రి.. లిస్టులో అన్ని క్రేజీ ప్రాజెక్టులే!