డిజిటల్‌‌  ఐడెంటిటీగా ఆధార్‌‌‌‌?

డిజిటల్‌‌  ఐడెంటిటీగా ఆధార్‌‌‌‌?

న్యూఢిల్లీ: ఆధార్ నెంబర్‌‌‌‌ను డిజిటల్‌‌ ఎకానమీలో మరింతగా వాడుకోవడంపై  ప్రభుత్వ అధికారులు, ఎక్స్‌‌పర్టులు మూడు రోజుల పాటు చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా  అంతర్జాతీయంగా డిజిటల్ ఐడెంటిటీగా ఆధార్‌‌‌‌ను డెవలప్‌‌ చేయడంపై చర్చలు జరపనున్నారు. ఈ నెల 23 నుంచి  25 మధ్య ‘ఆధార్‌‌‌‌ 2.0’ పేరుతో  మూడు రోజుల వర్క్‌‌ షాప్‌‌ జరగనుంది. ఈ వర్క్‌‌షాప్‌‌లో ఐటీ మినిస్టర్స్‌‌ అశ్విని వైష్ణవ్‌‌, రాజీవ్‌‌ చంద్రశేఖర్‌‌‌‌, యూఐడీఐ మాజీ చీఫ్‌‌లు నందన్ నిలేకని, ఆర్‌‌ఎస్‌‌ శర్మా, అజయ్ భూషణ్ ఫాండే, పీఎం ఎకానమీక్ కౌన్సిల్‌‌ చైర్మన్ వివేక్ దేబ్రాయ్‌‌, ఫైనాన్స్ సెక్రెటరీ టీవీ సోమనాథన్‌‌, మరికొంత మంది పాల్గొంటారు.