దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ, ఆప్ పార్టీలు పోటాపోటీగా దీక్షలు చేపట్టాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ నేతలు ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ మంత్రులతోపాటు ఆప్ నేతలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఆప్ పై కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటూ ఆప్ నేతలు మండిపడ్డారు. ఇప్పటి వరకు ఆప్ నేతల దగ్గర ఈడీ ఎలాంటి నగదు స్వాధీనం చేసుకోలేదన్నారు పార్టీ సీనియర్ లీడర్లు.
ఢిల్లీలో ఆప్ నేతల నిరాహార దీక్షకు పోటీగా బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. షరాబ్ సే శేష్ మహల్ పేరుతో...బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్, సిసోడియా భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. లిక్కర్ పాలసీతో ఆప్ నేతలకు భారీగా ముడుపు అందాయని ఆరోపించారు బీజేపీ నేతలు.