
ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ద్రవిడ్ తప్పుకోవడానికి సరైన కారణం తెలియాల్సి ఉంది. 2026కి ముందు జట్టుతో కొనసాగరని రాజస్థాన్ ఫ్రాంచైజీ శనివారం (ఆగస్టు 30) ధృవీకరించింది. ఒక్క సీజన్ కే ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశమైంది.
ప్లేయర్ గా, కోచ్ గా ఎంతో అనుభవమున్న ద్రవిడ్ తనంతట తాను వైదొలిగాడా.. లేకపోతే జట్టు యాజమాన్యమే తప్పించిందా అనే విషయంలో క్లారిటీ లేదు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. రాజస్థాన్ జట్టును ద్రవిడ్ వద్దనుకోవడానికి కారణం ఏమై ఉంటుందో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.
డివిలియర్స్ మాట్లాడుతూ రాజస్థాన్ యాజమాన్యం ద్రవిడ్ ను తెలివిగా తప్పించారని.. ఈ క్రమంలో ద్రవిడ్ బాధపడి ఉండొచ్చని తెలిపాడు. " ప్రీమియర్ లీగ్ వంటి ఫుట్‌బాల్ లీగ్‌లను మీరు గమనించినట్లయితే కోచ్‌లు జట్టుకు ఎల్లప్పుడూ టోర్నీలు అందించాలనే ఒత్తిడిలో ఉంటారు. ఒకవేళ వారు అలా చేయకపోతే చేయకపోతే యజమానులు నుండి ఒత్తిడి ప్రారంభమవుతుంది.
ALSO READ : మెన్స్‌ను మించిపోయారు: విజేతకు రూ.39 కోట్లు..
మనకు వాస్తవాలు తెలియవు. వేరే రోల్ కోసం ద్రవిడ్ కు ఆఫర్ ఇచ్చారని ఫ్రాంచైజీ చెబుతుంది. ఈ పాత్రకు ద్రవిడ్ అంగీకరించలేదంటే అతను ప్రధాన కోచ్ గా ఉండడానికి వారికి ఇష్టం లేదు. అదే సమయంలో వేరే రోల్ లో ఉండడం ద్రవిడ్ కు ఇష్టం లేదు. దీంతో ప్లాన్ చేసి ద్రవిడ్ ను తప్పించునట్టు నాకు అర్ధమవుతోంది". అని డివిలియర్స్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
సెప్టెంబర్ 6, 2024న ద్రవిడ్ తో రాజస్థాన్ రాయల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క సీజన్ కే ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాడు. గత సీజన్ (ఐపీఎల్ 2025) రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే కెప్టెన్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో విడిపోతున్నాడంటూ వార్తలు వస్తున్న సమయంలో ద్రవిడ్ రాజీనామా చేయడం ఆ జట్టులో గందరగోళంగా మారింది.
ద్రవిడ్ కు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య చక్కని అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తరపున కెప్టెన్ గా ఆడిన ఈ మాజీ భారత ప్లేయర్.. 2013లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కు జట్టును ఫైనల్ కు చేర్చాడు. 2012, 2013లో సీజన్‌లలో రాయల్స్ కెప్టెన్ గా ఉన్నాడు. 2014, 2015లో రాజస్థాన్ జట్టు మెంటార్ గా ఉన్నాడు.