మళ్లీ ట్రంపే గెలవాలి: హ్యుస్టన్ లో ప్రధాని

మళ్లీ ట్రంపే గెలవాలి: హ్యుస్టన్ లో ప్రధాని
  • ‘హౌడీ మోడీ’లో ప్రధాని ఆకాంక్ష..
  • ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ ’ నినాదమిచ్చి న మోడీ

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇండియాకు నిజమైన ఫ్రెండని, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నా రు. రెండు దేశాల దోస్తానా మరింత బలపడేలా అమెరికాలో మళ్లీ ట్రంపే ప్రెసిడెంట్ గా గెలవాలని ఆకాంక్షించారు.హూస్టన్ సిటీలోని ఎన్ ఆర్జీ స్టేడియంలో ఆదివారం అట్టహాసంగా జరిగిన ‘హౌడీ మోడీ’ ఈవెంట్ లోమాట్లాడిన ప్రధాని.. ‘‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’’నినాదమిచ్చారు.  టెక్సాస్‌ ఇండియా ఫోరం(టిఫ్‌)తోపాటు 600 సంస్థలు కలిసి నిర్వహించిన ఈ సభకు 50వేల మందికిపైగా ఎన్నారైలు హాజరయ్యారు. గుడ్ మార్నిం గ్ హూస్టన్ అంటూ ఇంగ్లీష్ లో ప్రసంగం చేసిన మోడీ, దాదాపు 20 నిమిషాలపాటు ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

‘‘ఇండియన్లతో మమేకం కావడానికి స్పెషల్ గెస్ట్​గా ట్రంప్ రావడం గొప్ప విషయం. తన కంపెనీ సీఈవో నుం చి అమెరికా కమాండర్ ఇన్ చీఫ్​గా ఎదిగిన ట్రంప్ .. పాలిటిక్స్​ నుంచి ఎకానమీ దాకా అన్నిరంగాల్లో తనదైన ముద్ర వేశారు. కలిసిన ప్రతిసారి ఫ్రెండ్లీ గా, అంతే ఎనర్జీతో ఉంటారు. అమెరికాను మళ్లీ గ్రేట్ గా నిలబెట్టేందు కు ఆయన చేస్తున్న కృషి అమోఘం. యూఎస్ తోపాటు ప్రపంచ దేశాల అభివృద్ధిలోనూ పాలుపంచుకున్నారు. అందుకే అబ్ కీబార్ ట్రంప్ సర్కార్ (మరోసారి ట్రంప్ ప్రభుత్వం )రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు.. తన ఫ్యామిలీకి నన్నొక ఫ్రెండ్ గా పరిచయం చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని (ట్రంప్ ను ) నా ఫ్యామిలీకి(జనం వైపుచూపిస్తూ) పరిచయం చేస్తున్నాను . హూస్టన్ నుంచి హైదరాబాద్ దాకా , బోస్టన్ నుంచి బెంగళూరుదాకా, ఆ మాటకొస్తే  ప్రపంచమంతా ఈ వేడుకను చూస్తోంది. కలిసి నడుస్తూ కొత్త లక్ష్యాలు చేరుకుం-దాం ’’ అని ప్రధాని అన్నారు. ట్రంప్ ప్రసంగించేట-ప్పుడు వేదిక దిగిన మోడీ.. ఆ తర్వాత మరోసారివేదికపై నుం చి హిందీలో ప్రసంగించారు.

అలరించిన కల్చరల్ ఈవెంట్స్  

వివిధ ప్రాంతాల నుం చి వచ్చిన 400 మంది కళాకారులు.. దాదాపు అన్ని భారతీయ భాషల్లోని పాటలు,ఆయా ప్రాంతాల నృత్యాలు ప్రదర్శించారు. ‘పక్కాలోకల్’ పాటకు అందరూ చిందు లేశారు.

రెగ్యు లర్ కుర్తాలో మోడీ

విదేశాలకు వెళ్లినప్పుడు నెక్ సూట్ ధరించే ప్రధాని మోడీ.. హౌడీ మోడీ ఈవెంట్ కు మాత్రం రెగ్యులర్ కుర్తా పైజామాలో వచ్చారు. లేత పసుపురంగు కుర్తా , తెలుపు పైజామా, పైన బ్లాక్ చెక్స్ హాఫ్ స్లీవ్స్ జాకెట్ వేసుకున్నారు. కాంగ్రెస్ సభ్యుల్ని పలకరిస్తూ వేదికపై ఉత్సాహంగా కదిలారు.

నమో తాలి.. ఎంతో రుచిరా..

హౌడీ మోడీ ఈవెంట్ కు వచ్చి న అతిథుల కోసం హూస్టన్ కు చెం దిన ఇండియన్ చెఫ్ కిరణ్ వర్మ ‘నమో తాలి’ పేరుతో ప్రత్యేక వంటకాల్ని వడ్డిం చారు. ఇందులో నమో తాలి సూరి, నమో తాలి మిఠాయి అనే రెండు డిష్ లు ఉన్నాయి. తాలిలో కిచిడీ, కచోరి, తెప్లా లాంటి పదార్థా లున్నాయి. తాలి మిఠాయిలో రస్ మలై, హల్వా, శ్రీఖండ్ తదితర స్వీట్లున్నాయి.

మనల్ని మనమే కాపాడుకోవాలి: ట్రంప్

‘‘అమెరికా, ఇండియా రెండు దేశాలూ బోర్డర్ తో ముడిపడిన సమస్యలు ఎదుర్కొంటున్నా యి. (ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో టెన్షన్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ) ఇస్లామిక్ టెర్రరిజం, ఇతర విద్రోహ శక్తుల నుం చి మన కమ్యూనిటీలను మనమే రక్షించుకోవాలి. అమెరికా, ఇండియా తమ బోర్డర్లను కాపాడుకోవాలి. టెర్రరిజంపై కలిసి పోరాడుతున్న రెండు దేశాలు.. టెర్రరిజం నుం చి అమాయక ప్రజల్ని కాపాడుకునే విషయంలో కట్టుబడి ఉన్నా యి. దేశ సరిహద్దుల్ని కాపాడే బాధ్యతలో అమరులైన సైనికుల్ని గౌరవిం చుకుం టూ, సెక్యూరిటీని పటిష్టం చేసుకుందాం . అమెరికా అభివృద్ధిలో ఎన్నారైలది కీలక పాత్ర. హెల్త్​, ఐటీ, బిజినెస్ తదితర రంగాల్లో వాళ్లు అద్భుతాలు సృష్టిం చారు. రాబోయే రోజుల్లో మోడీతో, ఇండియాతో ఇలాం టి దోస్తీనే కొనసాగి స్తా’’అని ట్రంప్ ముగించారు.