
-
లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌దే కీ రోల్
-
రూ.100 కోట్ల తరలింపులో ఆయనదే ప్రధాన పాత్ర
-
హవాలా మార్గంలో పెద్ద ఎత్తున ఢిల్లీకి డబ్బులు పంపారని కోర్డులో ఈడీ వాదన
-
అభిషేక్, విజయ్ నాయర్ ను మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించిన కోర్టు
హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్ లో నిందితులైన బోయినపల్లి అభిషేక్‌రావు, విజయ్ నాయర్ లను మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలిచ్చింది. వీళ్ల కస్టడీ ముగియడంతో శనివారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు వారిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరఫు లాయర్ వాదిస్తూ.. స్కామ్ లో ముడుపుల వ్యవహారంలో అభిషేక్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ‘‘రూ.100 కోట్లకు పైగా తరలించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించారు. పెద్ద ఎత్తున హవాలా మార్గంలో ఢిల్లీకి డబ్బులు పంపించారు. ఈ వివరాలన్నీ రాబట్టాల్సి ఉంది”అని అన్నారు.
‘‘ఈ టైమ్ లో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు. పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలి. ఇదే కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సీఏ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నిస్తున్నాం” అని తెలిపారు. నిందితుల తరఫు లాయర్ వాదిస్తూ.. ‘‘స్టేట్ మెంట్లు రికార్డు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి రికవరీ జరగలేదు. కస్టడీ కొనసాగించాల్సిన అవసరం లేదు” అని అన్నారు. వాదనలు విన్న కోర్టు అభిషేక్ , విజయ్ నాయర్ కు కస్టడీని మరో 5 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ముందే విజయ్ నాయర్ చేతికి పాలసీ రిపోర్టు
విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక వివరాలు వెల్లడించింది. ఈ స్కామ్ లో విజయ్ నాయర్, అభిషేక్ రావు కీలక పాత్ర పోషించారని పేర్కొంది. పాలసీ మార్పు కోసం రూ.100 కోట్ల వరకు అడ్వాన్స్ చెల్లింపులు జరిగాయని
పలువురు ప్రముఖులకు
నోటీసులు ఇచ్చే చాన్స్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర లింకులపై ఈడీ ఫోకస్ పెట్టింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది రాబడుతోంది. ఈ కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లై, విచారణకు హాజరవుతున్న సీఏ గోరంట్ల బుచ్చిబాబు స్టేట్‌మెంట్ల ఆధారంగా రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నేతల కంపెనీలకు బుచ్చిబాబు సీఏగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌లో బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. పలు కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా బుచ్చిబాబును విచారిస్తోంది. ఆయన దగ్గరి నుంచి కీలక వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. లిక్కర్ పాలసీలో లంచం డబ్బుతో పాటు షెల్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకు జరిగిన మనీ లాండరింగ్ వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్లు బోయినపల్లి అభిషేక్‌రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి నుంచి కూడా ఈడీ కీలక వివరాలు రాబడుతోంది. దీంతో సోమవారం నుంచి రాష్ట్రంలో మరోసారి ఈడీ సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.