దుబాయ్: ఇండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లను నిలబెట్టుకున్నారు. బుధవారం (నవంబర్ 05) విడుదలైన ఐసీసీ టీ20 బ్యాటర్ల లిస్ట్‌లో అభిషేక్ 925 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ , తిలక్ వర్మ 2, 3వ స్థానాల్లో నిలిచారు.
టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో చక్రవర్తి అగ్రస్థానంలోనే ఉండగా.. వెస్టిండీస్‌కు చెందిన అకీల్ హుస్సేన్, అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాప్–3లో నిలిచారు. ఆల్-రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నాలుగో స్థానంలో నిలవగా.. పాకిస్తాన్ ఆటగాడు సైమ్ అయూబ్ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు.
