ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన అభిషేక్ రావు, విజయ్ నాయర్ల కస్టడీ నేటితో ముగియనుంది. ఐదు రోజులపాటు వీరిని విచారించిన అధికారులు.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో హాజరుపరచనున్నారు. అభిషేక్ రావు, విజయ్ నాయర్ ల కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు కస్టడీని కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది.
మరోవైపు.. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా నిన్న రాబిన్ డిస్ట్రిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్లై, చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించారు. సౌత్ లాబీ గ్రూప్ నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించిన డబ్బుపై వీరిని ప్రశ్నించినట్లు సమాచారం. సౌత్ గ్రూప్ నుంచి వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలించారని ఈడీ మొదటి నుంచి అనుమానిస్తోంది.
