కరీంనగర్లో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ

కరీంనగర్లో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ

కరీంనగర్లో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసినా.. నిరసనకారులు మాత్రం ఆయనను అడ్డుకున్నారు. కేటీఆర్ ప్రారంభోత్సవం చేసే గెస్ట్ హౌస్ వద్ద ఆయన కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు రెండుసార్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ జెండాలతో వచ్చిన ఆందోళనకారులు ఆ తర్వాత కాషాయ జెండాలతో  నిరసన తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దురుసుగా ప్రవర్తించారు. నిరసనకారులను సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ కాలితో తన్నడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.