
- నల్గొండలోని రామగిరి నుంచి గడియారం వరకు ర్యాలీ
నల్గొండ అర్బన్, వెలుగు: ఏబీవీపీ 77 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నల్గొండ లోని రామగిరి నుంచి గడియారం వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలు రాజు మాట్లాడుతూ.. ఏబీవీపీ 1948 లోనే ఢిల్లీ యూనివర్సిటీలో మొదలైనా 1949 జులై 9 న అధికారికంగా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఏబీవీపీ మెంబర్‌షిప్, దేశ వ్యాప్తంగా వివిధ నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌గా గుర్తింపు పొందిందన్నారు.
ఓటు హక్కు వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడంలో, జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు అంశంలో కృషి చేసిందన్నారు. విద్యార్థి సమస్యలపై నిత్యం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్, జిల్లా నాయకులు శంకర్, సంపత్, శివ కుమార్, హనుమాన్, సూర్య, శ్వేత, అమల, శివ, వరుణ్, కార్తీక్, రిత్విక్ , గౌతమ్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.