ఇంటి నెంబర్ అలాట్ చేయడానికి లంచం.. కరీంనగర్ జిల్లాలో ఏసీబీ చేతికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఇంటి నెంబర్ అలాట్ చేయడానికి లంచం.. కరీంనగర్ జిల్లాలో  ఏసీబీ చేతికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎన్ని దాడులు చేసినా.. ఎంత మందిని సస్పెండ్ చేస్తున్నా అవినీతి అధికారుల తీరు మారటం లేదు. చిన్న విషయానికి కూడా పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 29) కరీంనగర్ జిల్లాలో అలాంటి ఓ లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కరీంనగర్ జిల్లా ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు పంచాయతీ కార్యదర్శి. వీణవంక మండలం చల్లూర్ గ్రామం లో ఇంటి నెంబర్ అలాట్ చేయడానికి ఇరువై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు పంచాయతీ కార్యదర్శి నాగరాజు. 

దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. చెప్పిన టైం లో డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పిన అధికారులు.. బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు.