చిలకలూరిపేటలో ఏసీబీ దాడులు - పట్టుబడ్డ అధికారి..!

చిలకలూరిపేటలో ఏసీబీ దాడులు - పట్టుబడ్డ అధికారి..!

చిలకలూరిపేటలోని విద్యుత్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలయ్యింది.ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో విద్యుత్ శాఖాధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వయవసాయ విద్యుత్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ కోసం రైతు నుండి 55000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.

అవినీతికి పాల్పడుతున్న అధికారిని పట్టుకోవటంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.అసలే వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు లేక సతమతం అవుతున్న తమకు ఇలాంటి అధికారులు మరింత భారం అవుతున్నారని, అధికారులు ఇలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు .