ఏపీలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ అధికారులు సోమవారం ( ఏప్రిల్ 27 ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు బాపట్ల ఆర్ఐ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... బాపట్ల నగరపాలక సంస్థలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఆర్ఐ షేక్ ఇమామ్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు.
సూర్యలంక హైవే ముత్తయ్యపాలెం టీ హౌస్ దగ్గర రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా షేక్ ఇమామ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు.షేక్ ఇమామ్ ను అదుపులోకి తీసుకొని బాపట్ల మున్సిపల్ ఆఫీసుకు తరలించి విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.

