వైరా మత్స్యశాఖ ఆఫీసులో ఏసీబీ సోదాలు

వైరా మత్స్యశాఖ ఆఫీసులో ఏసీబీ సోదాలు

ఖమ్మం జిల్లా వైరా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఔట్ సోర్సింగ్  ఉద్యోగి మురళిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్ పే ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్నారు. వైరా రిజర్వాయర్ పరిధిలోని  మత్స్యకారులు జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్ 31 వరకు చేపల వేట సాగిస్తారు.ఇందుకోసం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. కానీ ఈఏడాది మత్స్యకారులు ఆ పన్ను చెల్లించలేదు. గడువు ముగిసినా చేపల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. 

దీనిపై అభ్యంతరం చెప్పిన మత్స్యశాఖ అధికారులు పన్నుచెల్లించేదాకా చేపల వేట చేయొద్దని చెప్పారు. ఆ తర్వాత  లక్ష రూపాయలు ఇస్తేనే చేపల వేటకు అనుమతిస్తామన్నారు. దీంతో చేపల సొసైటీ సభ్యులు 50 వేలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫోన్ లో  పంపించారు.  మిగతా డబ్బుల కోసం మత్స్యశాఖ అధికారి ఇబ్బంది పెట్టడంతో కొన్ని నెల కిందట కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.