ఈఎస్​ఐ స్కామ్​లో 4.5 కోట్లు సీజ్​

ఈఎస్​ఐ స్కామ్​లో 4.5 కోట్లు సీజ్​

రియల్​ ఎస్టేట్​లో నాగలక్ష్మితో కలిసి దేవికారాణి పెట్టుబడులు

వ్యాపారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్న ఏసీబీ

హైదరాబాద్​, వెలుగు: ఈఎస్​ఐలో మందుల స్కామ్​పై దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఇన్సూరెన్స్​ మెడికల్​ సర్వీసెస్​ మాజీ డైరెక్టర్​ దేవికా రాణి, ఇతర నిందితుల అక్రమ సంపాదన వివరాలను సేకరిస్తోంది. మంగళవారం రూ.4 కోట్ల 47 లక్షలను స్వాధీనం చేసుకుంది. అవినీతి సొమ్మును ఫార్మాసిస్ట్​ నాగలక్ష్మితో కలిసి రియల్​ఎస్టేట్​లో దేవికారాణి పెట్టుబడి పెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. ఐటీ కారిడార్​, సైబరాబాద్​లో రెసిడెన్షియల్​, కమర్షియల్​ కాంప్లెక్సులకు సొమ్మును మళ్లించినట్టు ఆధారాలు సేకరించింది. సైబరాబాద్​లోని ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారికి దేవికారాణి రూ.3 కోట్ల 75 లక్షలు, నాగలక్ష్మి రూ.72 లక్షలు పెట్టుబడిగా ఇచ్చినట్టు గుర్తిం చింది. వాళ్లిద్దరి ఇండ్ల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఈ విషయాన్ని తేల్చింది. కుటుంబ సభ్యుల పేరిట 1,600 గజాల ఆరు రెసిడెన్షియల్​ ప్లాట్స్​ కోసం రూ.22 లక్షలు క్యాష్​ రూపంలో ఇచ్చినట్టు, రూ.2 కోట్ల 29 లక్షల 30 వేలను చెక్కులు, ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్​ల ద్వారా చెల్లించినట్టు నిర్ధారించింది. వీటి ఆధారంగా సైబరాబాద్​లోని ఆ డెవలపర్​కు ఏసీబీ నోటీసులిచ్చింది. అవినీతి డబ్బును తిరిగి అప్పగించాలని, లేకపోతే ఆస్తులను అటాచ్​ చేస్తామని హెచ్చరించింది. దీంతో అతడు రూ.4.47 కోట్లను ఏసీబీ అధికారులకు అందజేశాడు. ఆ డబ్బును ఏసీబీ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్​ చేశారు.

For More News..

హైడల్​ పవర్​ ఉత్పత్తి ఢమాల్​

తెలంగాణలో కొత్తగా 2,832 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో లక్ష టన్నుల యూరియా కొరత