
Accenture Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ప్రభావం ఇప్పుడిప్పుడే తీవ్రతరం అవుతోంది. ప్రధానంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇది ఊపిరి సలపనివ్వటం లేదు. తగ్గుతున్న కొత్త ప్రాజెక్టులు.. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ బడ్జెట్ కోతలతో టాప్ టెక్ కంపెనీలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఏఐని తమ రోజువారీ పనిలో మమేకం చేస్తుండటం కూడా నిపుణుల అవసరాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు తేలింది.
ఈ క్రమంలో టెక్ దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగులను అప్ స్కిల్ చేస్తోంది. అలాగే ఆగస్టు చివరి నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 11వేలు తగ్గి 7లక్షల 79వేలకు చేరినట్లు వెల్లడించింది. అయితే నవంబర్ వరకు ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతాయని యాక్సెంచర్ చెబుతోంది. ఈ క్రమంలో గడచిన ఆరు నెలలుగా కంపెనీ చేపడుతున్న చర్యలతో దాదాపు రూ.8వేల 500 కోట్ల వరకు సేవ్ చేసుకుంది. మరో పక్క ఏఐ డిమాండ్ అందుకునేందుకు తమ వద్ద ఉన్న ఉద్యోగులను ట్రైన్ చేయటం కొనసాగిస్తోంది.
►ALSO READ | భారీగా పెరిగిన క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. సెబీ కీలక నిర్ణయం..
జూన్ ఆగస్టు త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపధికన 7 శాతం పెరిగి 17.60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్లయింట్లు కోరుకుంటున్న ఏఐ ఆవిష్కరణలు అందించటానికి అలాగే వారి డిమాండ్స్ తీర్చటానికి ప్రత్యేక సామర్థ్యాలను యాక్సెంచర్ కలిగి ఉన్నట్లు తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయని కంపెనీ చైర్ అండ్ సీఈవో జూలీ స్వీట్ అన్నారు.