ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కట్ని జిల్లాకు చెందిన కార్మికులు కాంట్రాక్ట్ పని నిమిత్తం నీముచ్ కు ఒక వ్యాన్ లో  వెళ్తున్నారు. కాగా.. వీరు ప్రయాణిస్తున్న కారు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉజ్జయిని జిల్లాలోని నార్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు కారులో ఇరుక్కుపోయారు. ప్రమాద విషయం తెలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో వాహనంలో ఇరుకున్నవారిని బయటకు తీశారు. గాయపడ్డవారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్, క్లీనర్ అక్కడినుంచి పరారయ్యారని.. ట్రక్కును సీజ్ చేశామని ఉజ్జయిని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎఎస్పీ) రూపేష్ ద్వివేది తెలిపారు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆయన అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

For More News..

సచివాలయ నిర్మాణ టెండర్ల గడువు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

కూతురిపై 10 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న రైల్వే ఉద్యోగి.. 

దిశ ఘటనను అచ్చుగుద్దినట్లు దింపిన ఆర్జీవీ ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్