'ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్' కంపెనీలో ప్రమాదం.. స్టీమ్ పైపు పగిలి కార్మికుడు స్పాట్ డెడ్

'ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్' కంపెనీలో ప్రమాదం.. స్టీమ్ పైపు పగిలి కార్మికుడు స్పాట్ డెడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని 'ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్' కంపెనీలో ప్రమాదం జరిగింది. ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో ప్రమాదం తలెత్తింది. స్టీమ్ పైపు పగిలి కార్మికుడి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడిని ఆలేరుకు చెందిన సదానందంగా గుర్తించారు. 20 ఏళ్ల క్రితం గోదావరిఖని నుంచి ట్రాన్స్‌ఫర్పై ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీకి సదానందం వచ్చినట్లు తెలిసింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం జరిగిన స్థలాన్ని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు పరిశీలించారు.

ఇదిలా ఉండగా.. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతుండటం కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో జనవరి 4న కూడా భారీ పేలుదు సంభవించింది. పేలుడు ధాటికి ఓ కార్మికుడు చనిపోగా మరోముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... కంపెనీలోని పీఆర్డీసీ బిల్డింగ్ 3లోని వేమెంట్ సెక్షన్లో శనివారం ఉదయం కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు కార్మికులు ఎంవీటీ (మెగ్నీషియం, వైటాన్, టెఫ్లాన్) మిశ్రమాన్ని వేయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9.45 గంటలకు పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కార్మికుడు మార్క కనకయ్య (54), యాదగిరి గుట్ట మండలం రామాజీపేటకు చెందిన మొగిలిపాక ప్రకాశ్, వంగపల్లికి చెందిన నర్సింహులు, వేణుగోపాల్గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కు తరలిస్తుండగా కనకయ్య మార్గమధ్యలో చనిపోయాడు. ప్రకాశ్ను హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించగా, నర్సింహులు, వేణుగోపాల్ భువనగిరిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. పేలుడు కొన్ని నిమిషాల ముందుగనక జరిగి ఉంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేది.

పేలుడు జరిగిన పీఆర్డీసీ బిల్డింగ్ 3లో పనిచేసేందుకు ఉదయం 6 గంటలకు ఫస్ట్ షిఫ్ట్లో 16 మంది కార్మికులు వచ్చారు. ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ ఎక్కిన కార్మికులకు 10 గంటలకు భోజనాల టైం ఉంది. దీంతో 12 మంది కార్మికులు 9.30 గంటలకే బయటకు రాగా మిగతా నలుగురు బిల్డింగ్లోనే పనిచేస్తున్నారు. ఈ టైంలో ప్రమాదం జర గడంతో ఒక కార్మికుడు చనిపోయాడు. అదే భోజనాల టైం కాకుంటే కార్మికులంతా బిల్డింగ్లోనే ఉండేవారని, దీని వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేదని కార్మికులు భయాందోళన వ్యక్తం చేశారు.

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఏప్రిల్ 29న భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు చనిపోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాటేపల్లిలోని ప్రీమియర్  ఎక్స్ ప్లోజివ్స్  కంపెనీ బిల్డింగ్- లోని 18ఏ బ్లాకులో మంగళవారం ఎనిమిది మంది కార్మికులు పని చేస్తున్నారు. బిల్డింగ్లో ప్రోక్లెంట్  మిక్సింగ్  పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బిల్డింగ్  మొత్తం కుప్పకూలింది.

ప్రమాదంలో కాటేపల్లికి చెందిన గునుకుంట్ల సందీప్(30), మోటకొండూర్కు చెందిన దేవీచరణ్(20) బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే చనిపోగా.. ఆత్మకూరుకు చెందిన కలువల నరేశ్(30) హైదరాబాద్  యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు.