కరీంనగర్ హైవేపై ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మృతి

కరీంనగర్ హైవేపై ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మృతి

హైదరాబాద్-కరీంనగర్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం (అక్టోబర్ 10)  రాత్రి జరిగిన ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ చనిపోవడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా బైకు అదుపుతప్పి పడిపోయిన ఘటనలో రవళిక అనే యువతి (సాఫ్ట్వేర్ ఇంజినీర్) మృతి చెందింది.

తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ ఎల్ఎడీ కాలనీ దగ్గర రాజీవ్ రహదారిపై జరిగింది ఈ ప్రమాదం. కరీంనగర్ జిల్లాలోని గంగాధరకు చెందిన రవళిక.. హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. వెంకట సాయి అనే యువకుడితో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

బైక్ అదుపు తప్పి కింద పడడంతో రవళిక అక్కడికక్కడే చనిపోయింది. వెంకట సాయికి  తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.