ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. భర్త మృతి భార్య పరిస్థితి విషమం

ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. భర్త మృతి భార్య పరిస్థితి విషమం

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్  పై నుండి కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే బాచారానికి చెందిన మోర ఉపేందర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఘటికేసర్ నుండి అంబర్ పెట్ వైపు కారులో వస్తున్నాడు.బాచారం స్టేజి వద్ద కారు అదుపు తప్పి ఓఆర్ఆర్ బ్రిడ్జి పై నుండి కింద పడింది. స్థానికులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఉపేందర్ చనిపోయినట్టు నిర్ధారించారు.   ఉపేందర్ భార్య భవ్య శ్రీని చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ముగ్గురు పిల్లలు క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.