వన్డే వరల్డ్ కప్ 2023: ఉప్పల్ వేదికగా పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఎప్పుడెప్పుడంటే?

వన్డే వరల్డ్ కప్ 2023: ఉప్పల్ వేదికగా పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఎప్పుడెప్పుడంటే?

తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ మ్యాచులు ఆడనుంది. ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ ఈఎస్‌పీఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 6, 12 తేదీల్లో ఉప్పల్ వేదికగా క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన జట్లతో పాక్ తలపడనుంది. అయితే ఉప్పల్ వేదికపై భారత్ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచులు లేనట్లు సమాచారం.

టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్దం చేసిన డ్రాప్ట్‌ షెడ్యూల్‌లో హైదరాబాద్‌ పేరు లేనట్లు తెలుస్తోంది. ఈఎస్‌పీఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ 9 వేదికలను ఖారారు చేసింది. అందులో చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వేదికలకు అవకాశం కల్పించింది. 

పాకిస్థాన్‌ వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్

  • అక్టోబర్ 6: పాకిస్తాన్ vs క్వాలిఫయర్‌ టీం (హైదరాబాద్‌)
  • అక్టోబర్ 12: పాకిస్తాన్ vs క్వాలిఫయర్‌ టీం (హైదరాబాద్‌)
  • అక్టోబర్‌ 15: ఇండియా vs పాకిస్తాన్ (అహ్మదాబాద్‌)
  • అక్టోబర్ 20: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ (బెంగళూరు) 
  • అక్టోబర్ 23: అఫ్గానిస్థాన్‌ vs పాకిస్తాన్ (దక్షిణాఫ్రికా)
  • అక్టోబర్ 27: పాకిస్తాన్ vs సౌతాఫ్రికా (చెన్నై) 
  • అక్టోబర్‌ 31: బంగ్లాదేశ్‌ vs పాకిస్తాన్ (కోల్‌కతా)
  • నవంబర్ 5: న్యూజిలాండ్‌ vs పాకిస్తాన్ (బెంగళూరు)
  • నవంబర్‌ 12: ఇంగ్లండ్ vs పాకిస్తాన్ (కోల్‌కతా)