ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న నిందితులు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న నిందితులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో కొనసాగుతున్న నిందితులు.. బెయిల్ కోసం అప్లై చేసిన పిటిషన్లు విత్ డ్రా చేసుుకున్నారు. ఈ కేసులో సెక్షన్ 70 ఐటి యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. దీంతో  ఒక్కొక్కరికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్ళాలని నాంపల్లి ఏసీఎంఎం కోర్టు సూచించింది. 

  దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ లు విత్ డ్రా చేసుకున్నారు రిమాండ్ లో ఉన్న నిందితులు. రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో  ఫ్రెష్ బెయిల్ పిటిషన్ లు దాఖలు చేయనున్నారు. మరోవైపు ఈ కేసులో ఏ1గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ ను పొడిగింది కోర్టు. ఈ నెల ఏప్రిల్ 12ను రిమాండ్ ముగియడంతో మరికొన్ని రోజులకు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.