ప్రేమ కోసం సప్త సాగరాలు దాటి

ప్రేమ కోసం సప్త సాగరాలు దాటి

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో ఈనెల 22న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌కి నిర్మాత సురేష్ బాబు, రచయిత బి.వి.ఎస్.ఎన్ రవి హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.

రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘కొన్ని సినిమాలను మనం వేరే భాషకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాటంతటవే వెళ్తాయి. నా గత చిత్రం ‘777 చార్లీ’ కర్ణాటక తర్వాత తెలుగులోనే బాగా ఆడింది. అందుకే నేను ఈ ప్రాంతాన్ని సినిమా భూమిగా భావిస్తాను. సినిమాను ఇక్కడ ఓ సంస్కృతిగా చూస్తారు. నాక్కూడా సినిమానే జీవితం, సినిమానే దేవుడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’ అన్నాడు. ‘మా మను, ప్రియల ప్రేమకథ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పింది హీరోయిన్ రుక్మిణీ వసంత్.

దర్శకుడు హేమంత్ ఎం రావు మాట్లాడుతూ ‘హైదరాబాద్‌‌లోనూ ఈ మూవీ కన్నడ వెర్షన్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తెలుగులోనే విడుదలవుతోంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది’ అన్నాడు. తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల చెప్పారు.