అరబిందో ఫార్మాపై చర్యలు తీసుకోకపోతే ...నేనే తగులబెడుతా..జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

అరబిందో ఫార్మాపై చర్యలు తీసుకోకపోతే ...నేనే తగులబెడుతా..జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు : ‘ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలు వదలొద్దని హెచ్చరించినా, అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా అరబిందో ఫార్మా పట్టించుకోవడం లేదు, ఈ విషయంపై చర్యలు తీసుకునేందుకు కాలుష్య నియంత్రణ మండలికి ఒక్క రోజు టైమ్‌ ఇస్తున్నా.. అప్పటికీ పట్టించుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు నేను అరబిందో ఫార్మాను తగులబెడుతా’ అని జడ్చర్ల ఎమ్మెల్యే  అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. 

కర్నాటకలో ఉన్న ఆయన శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీ నుంచి వచ్చే కాలుష్య జలాలు ముద్దిరెడ్డిపల్లి చెరువులో కలవడంతో చేపలు చనిపోతున్నాయని, పంటలు కూడా పండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినా, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కలుషిత జలాలను చెరువులోకి వదులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.