
సీనియర్ నటుడు చంద్రమోహన్ అంతక్రియలు కన్నీటి వీడ్కోలుతో ముగిసాయి. హైదరాబాద్ లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన సోదరుడు మల్లంపల్లి దుర్గాప్రసాద్ చేతుమీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. కుటుంబ సభ్యులు, అతికొద్దీ మంది సినీ ప్రముఖుల మధ్య చంద్రమోహన్ అంతక్రియలు సాగాయి.
హీరో వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరిరావు, మాదాల రవి తదితరులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు..వెలిగిన చంద్రుడు ఇక లేరంటూ..ఆయన అభిమానులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.
1966లో వచ్చిన రంగులరాట్నం సినిమాతో తొలిసారి హీరోగా వెండితెరపై కనిపించారు చంద్రమోహన్. ఆ సినిమా మంచి విజయం సాదించడంతో వరుస అవకాశాలు అందుకున్నారు. అలా సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి వంటి గొప్ప సినిమాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని తెలుగు వారికి సుపరిచితుడయ్యారు.