Rashmika Mandanna: బాయ్ ఫ్రెండ్ ఎవరో తేల్చిన నేషనల్ క్రష్ రష్మిక !

Rashmika Mandanna: బాయ్ ఫ్రెండ్ ఎవరో తేల్చిన నేషనల్ క్రష్ రష్మిక !

రష్మిక మందన్నా (Rashmika Mandanna)ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండును పరిచయం చేసింది. తన బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోను పంచుకుంది. ఇక యానిమల్ కంప్లీట్ కాగానే మళ్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయి.. తన సినిమాల్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. 

అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ వివరాలు బయటపెట్టింది రష్మిక. రష్మికకు బాయ్ ఫ్రెండా అంటూ ఆశ్చర్యపోతున్నారు..ఇది సినిమాలోనే భాగంగానే. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend) అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా లేడీ ఒరియెంటెడ్గా తెరకెక్కుతుండగా.. ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండుగా ఓ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు..దసరా సినిమాలో నాని ఫ్రెండుగా నటించిన దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty). ఈ కుర్ర హీరో..దసరాలో నటించి..అమ్మాయిలకు తెగ నచ్చేశాడు.

ఇప్పుడు ఈ హీరో రష్మిక బాయ్ ఫ్రెండుగా ది గర్ల్ ఫ్రెండు మూవీలో నటించనున్నారు. రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ విక్రమ్.ఇతనే అంటూ మేకర్స్ స్పెషల్ వీడియోతో తెలిపారు.ప్రస్తుతం రష్మిక బాయ్ ఫ్రెండు అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.   

అందాల రాక్షసి, చిలసౌ వంటి మూవీస్తో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్​ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మికకు 24వ చిత్రం కాగా..గీతా ఆర్ట్స్51వ చిత్రంగా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.