
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ సెన్సేషన్ గా మారింది. దీంతో ఆమెపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హేమను "మా" నుంచి సస్పెండ్ చేయాలని డిసైడ్ చేశారు. రేపు జూన్ 6 2024 నాడు అధికారికంగా హేమను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది.
రేవ్ పార్టీ కేసు పై "మా" ప్రెసిడెంట్ మంచు విష్ణు.. హేమను సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. ఇందుకు సభ్యులు బదులిస్తూ హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని సూచించారు. ఆ మేరుకు మంచు రేపు అధికారికంగా హేమ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించబోతున్నట్టు సమాచారం.