తిరుమలలో కిరణ్ అబ్బవరం దంపతులు.. శ్రీవారి సన్నిధిలో కుమారుడికి నామకరణం.

తిరుమలలో కిరణ్ అబ్బవరం దంపతులు.. శ్రీవారి సన్నిధిలో కుమారుడికి నామకరణం.

టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తమ  బాబు నామకరణం తిరుమలలో చేసేందుకు వచ్చామని తెలిపారు.  కిరణ్ అబ్బవరం. బాబుకి హను అబ్బవరం అని పేరు పెట్టామని చెప్పారు. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు

దర్శనం అనంతరం ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడారు. తొలి సారి తన కుమారుడితో వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.  శ్రీవారి సన్నిధిలో  తమ కుమారుడికి నామకరణం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ బాబుకి హను అబ్బవరం అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. శ్రీవారి ఆశీస్సులతో అందరూసంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
 
 ప్రస్తుతం 'కే ర్యాంప్' , 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాల షూటింగ్ జరుగుతోందని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ నెలలోనే మరో కొత్త సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. దర్శనం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కిరణ్ అబ్బవరం కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.