
ముంబై: వెటర్నరీ హాస్పిటల్ సిబ్బందిని కొట్టింది యాక్టర్ నసిరుద్దీన్ షా కూతురు హీబా షా. దీంతో ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 16వతేదీన ముంబైలోని ఓ వెటర్నరీ హాస్పిటల్ కు తన పెంపుడు పిల్లులకు వైద్యం చేయించడానికి తీసుకెళ్లింది. అప్పటికే వైద్యులు వేరే పిల్లులకు ఆపరేషన్ చేస్తున్నందున హీబాను ఐదు నిమిషాలు వేయిట్ చేయమన్నారు. మూడు నిమిషాలు అయిన తర్వాత అసహనానికి గురైనా హీబా షా… నేనెవరో తెలుసా మీకు .. నన్నే వెయిట్ చేయమంటారా అని హాస్పిటల్ వాళ్లతో కొట్లాడింది. దీంతో పాటు ఇద్దరు నర్స్ లను కొట్టింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనపై హీబా పటేల్ ను మీడియా ప్రశ్నించగా.. అవును నేను హాస్పిటల్ సిబ్బందిని కొట్టాను. అయితే వాళ్లే నాపై అమర్యాదగా ప్రవర్తించారు. నేను క్యాబ్ నుంచి దిగగానే నాపిల్లులను హాస్పిటల్ సిబ్బంది లోపలికి తీసుకెళ్లడానికి సహాయం చేయలేదు. పైగా నన్ను గేట్ దగ్గరే సెక్యురిటీ ఆపి చాలా సేపు ప్రశ్నించాడు. లోపల కూడా నన్ను వెయిట్ చేయించారు.. అందుకే హాస్పిటల్ సిబ్బందితో కొట్లాడాల్సి వచ్చిందని తెలిపింది. హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో… సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు… హీబా పై ఐపీసీ సెక్షన్ 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని వార్తలు
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలను వెనక్కి పంపించాలి
టర్కీలో భూకంపం… 18మంది మృతి
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ.9లక్షల ఫైన్
Mumbai's Versova police have registered a non-cognizable offence against actress Heeba Shah (daughter of actor Naseeruddin Shah) for allegedly assaulting 2 employees of a veterinary clinic on January 16. pic.twitter.com/M2u4rdgGTL
— ANI (@ANI) January 25, 2020